టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వేములవాడ బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ చెన్నమనేని వికాస్ అన్నారు. సోమవారం నియోజకవర్గ పరిధిలోని కొనరావుపేట మండలంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. సనాతన ధర్మ రక్షణ కోసం, దేశ శ్రేయస్సు కోసం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అనునిత్యం కృషి చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ పార్టీ అని అన్నారు.