భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి కేటీకే ఆరవ బొగ్గుగనిలో శనివారం ఉదయం కార్మికులు విధులు నిర్వహిస్తుండగా రూబోల్టింగ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా బండకూలి రాదండి మొండయ్య అనే కార్మికుని కాలు పై పడడంతో కాలు పూర్తిగా నుజ్జు నుజ్జు కావడం జరిగింది. వెంటనే తోటి కార్మికులు అధికారులకు సమాచారం అందించారు చేరుకున్న అధికారులు సింగరేణి ఆంబులెన్స్ ద్వారా మొండయ్యను జిల్లా కేంద్రంలోని సింగరేణి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.