నేరేడుచర్ల మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ మరో రైతును పొట్టనపెట్టుకుంది. మండల పరిధిలోని పెంచికల్ దిన్న గ్రామానికి చెందిన రైతు నగిరి శ్రీను(60) విద్యుత్ షాక్తో మరణించారు. బుధవారం వ్యవసాయ క్షేత్రంలోని మోటార్లో నీరు పోస్తుండగా.... విద్యుత్ షాక్ తగలడంతో అక్కడిక్కడే మృతిచెందినట్లు స్థానిక రైతులు తెలిపారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపిస్తున్నారు.