గిరిజన హక్కుల పరిరక్షణ కోసం ఏర్పడిన పీసా చట్టంపై అందరికీ అవగాహన కల్పించాలని కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ సంచాలకులు రమిత్ మౌర్య అధికారులను ఆదేశించారు. గురువారం పాడేరు ఐటీడీఏ పరిధిలోని గొందూరు, తడిగిరి పంచాయతీలను సందర్శించి, గ్రామస్థులు, పీసా కమిటీ సభ్యులు, మహిళలతో సమావేశాలు నిర్వహించారు. హక్కుల కోసం అహర్నిశలు పోరాడిన గిరిజనులకు పీసా ప్రత్యేక చట్టం వరంగా మారిందన్నారు. ఈ చట్టం వారి తలరాతలను మార్చిందన్నారు.