గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో డీజేకు అనుమతి లేదని ఎస్సై లింబాద్రి అన్నారు. నిర్మల్ రూరల్ మండలం నీలాయిపేట్ గ్రామంలో గణేష్ మండప నిర్వహకులు, యూత్ సభ్యులతో శుక్రవారం గణేష్ ఉత్సవాలపై సమావేశం నిర్వహించారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు శాంతి యుతంగా జరుపుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ఉత్సవ కమిటీలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గణేష్ మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్‌లో అనుమతి తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు సాయన్న, విలాస్ తదితరులు పాల్గొన్నారు