ఇచ్చోడ మండలం గేరిజం గ్రామంలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ రాజర్షి షా బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.నిబంధనల ప్రకారం ఎన్యుమరేటర్లు,సూపర్వైజర్లు సర్వే చేయటానికి సిద్ధం కాకపోవటంతో గ్రామ ఇంచార్జీ ఐన మండల వ్యవసాయ అధికారి కైలాస్ పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.విధుల్లో అలసత్వం వహించినందుకు మండల వ్యవసాయ అధికారి కైలాస్ కు షోకాస్ నోటీసు జారీ చేయాలని జిల్లా అగ్రికల్చర్ అధికారికి ఆదేశించారు.