నరసాపురం మండలం వేములదీవి వెస్ట్ లో స్త్రీ శక్తి పథకం మహిళా సాధికారత మరియు నరసాపురం నియోజకవర్గ సూపర్ సిక్స్ పథకాల విజయోత్సవ సభను శనివారం సాయంత్రం 5 గంటలకు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ మరియు నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ మరియు టిడిపి ఇన్చార్జ్ పొత్తూరి రామరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయకర్ మాట్లాడుతూ.. ముఖ్యంగా మహిళల సామర్థ్యాన్ని పెంపొందించడానికి రూపొందించిన "స్త్రీ శక్తి" పథకం గురించి మరియు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు గురించి ప్రత్యేకంగా వివరించారు.