కావలి పిఏసిఎస్ చైర్మన్ గా కాటా భాస్కర్ రెడ్డి, డైరెక్టర్లుగా సోమయ్యగారి రమణ, కమతం ప్రసాద్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. కావలి శివాలయం పక్కన గల కల్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి, కష్ట నష్టాల్లో పార్టీకి అండగా నిలిచిన వారికి పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమం శనివారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో జరిగింది.