మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ పోషణ మాసంలో భాగంగా నెరడిగొండ మండలం చించోలి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ లో ఏర్పాటు చేసిన అన్నప్రాసన, సీమంతం కార్యక్రమం లో జిల్లా పాలనాధికారి రాజర్శి షా ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారికి అన్నప్రాసన చేశారు.మహిళలు బాగుంటేనే దేశం బాగుంటుందని, పోషకాహారం తోనే ఆరోగ్య సమాజం నిర్మితమవుతుందని ఆన్నారు.గర్భిణీ స్త్రీలు, బాలింతలు , చిన్నారులు రక్తహీనత నివారణకు పోషకాహారం తీసుకోవాలని కోరారు.