పలమనేరు: పట్టణం శ్రీకృష్ణదేవరాయలు సర్కిల్ వద్ద ప్రముఖ నటులు మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు వేడుకలను బలిజ అభ్యుదయ సేవా సంఘం BASS ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిపారు. ఈ సందర్భంగా ఇండియన్ టీం అండర్ 20 రగ్బీ క్రీడాకారిణి నర్రా అక్షయ హాజరై కేక్ కట్ చేశారు. భారీ ఎత్తున బాణాసంచా కాల్చి విచ్చేసిన అభిమానులకు ప్రజలకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాస్ నాయకులు మాట్లాడుతూ, చిరంజీవి అంటే సినిమా నటుడే కాదు సామాజికవేత్త, రాజకీయవేత్త, కష్టించి పైకొచ్చిన వ్యక్తి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నామంటూ తెలిపారు.