ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని కలదిండి మండలం సానరుద్రవరంలో వంగవీటి మోహనరంగా విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు పేడ పూసిన సంఘటన శనివారం విలువలోకి వచ్చింది ఈ ఘటనకు సంబంధించి సిసి ఫుటేజీలు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో వాట్సాప్ గ్రూపులో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి రంగా విగ్రహానికి పేడ పూసి పారిపోయినట్లు సిసి ఫుటేజ్ లో స్పష్టంగా కనిపిస్తుంది ప్రస్తుతం ఈ ఫొటోస్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు