కనిగిరి: స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కనిగిరి ఆర్డిఓ కేశవర్ధన్ రెడ్డి సూచించారు. కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని 8 వ వార్డులో స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను శనివారం ఆర్డీవో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర ఒక మంచి కార్యక్రమం అని, ఈ కార్యక్రమం ద్వారా మన పల్లెలు, పట్టణాలను భాగస్వాములై స్వచ్ఛందంగా బాగు చేసుకునే అవకాశం ఉందన్నారు. క్లీన్ అండ్ గ్రీన్ గా మన ప్రాంతాలను తీర్చిదిద్దుకుందామన్నారు.