Araku Valley, Alluri Sitharama Raju | Aug 13, 2025
పెదబయలు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం వాడి, వేడిగా సాగింది. మండల పరిషత్ అధ్యక్షురాలు వరహాలమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకోవటం లేదని ముక్తకంఠంతో సభ్యులు ఖండించారు. ఆర్ అండ్ బి, జీసీసీ, రెవెన్యూ శాఖల సమీక్షలో ఉత్కంఠ నెలకొంది. సభ్యుల ప్రశ్నలకు అధికారులు సరైన సమాధానాలు ఇవ్వలేకపోయారు. మండలంలో గల ప్రధాన సమస్యలు పరిష్కారం చేయకపోతే ఆందోళనలు చేస్తామని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.