ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆగస్టు 24 నుండి 26వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాలకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.ఇందులో భాగంగా సాయంత్రం 6 గంటల నుండి మేధిని పూజ, మృత్సంగ్రహణం, అంకురార్పణ ఘట్టాలు నిర్వహించారు. యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ప్రతి ఏడాది మూడు రోజులపాటు పవిత్ర ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు.