సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి మరియు వైద్య ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బ్లడ్ క్యాంపు ను నిర్వహిస్తున్నామని, భవిష్యత్ లో ప్రభుత్వ డిగ్రీ, మెడికల్ ఇతరత్ర కళాశాలలో కూడా నెలకు ఒక సారి బ్లడ్ క్యాంపు నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులలో సరిపడిన్నని బ్లడ్ యూనిట్ లు లేని కారణంగా ఇక్కడ సేకరించిన బ్లడ్ ను సీజనల్ వ్యాధుల బార