పార్వతీపురం మన్యం జిల్లాలో ఉపాధి హామీ పథకములో అక్రమాలకు, అవినీతికి పాల్పడుతున్న పిడి రామచంద్రరావు పై చర్యలు తీసుకోవాలని *సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై మన్మధరావు, కార్యదర్శి బి వి రమణ* డిమాండ్ చేశారు శనివారం పార్వతీపురం సుందరయ్య భవనంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి కూలీల నుంచి ప్రతి వారం వంద రూపాయలు చొప్పున అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఇప్పటికే అనేక సందర్భాల్లో ఫిర్యాదులు చేసినప్పటికీ కనీస చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు.. ఉపాధి కూలీల మస్టర్లు రికార్డులు కూడా ఇవ్వకుండా నెలకి 10 లక్షలు రూపాయలు స్వాహా చేసినట్లు ఆరోపించారు.