నర్సాపూర్ నియోజకవర్గ శివంపేట మండలం రత్నాపూర్ అంగన్వాడి సెంటర్లో సుందెలకపడిన నీటిని తాగి అస్వస్థత గురైన విద్యార్థులను నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆదివారం డిసిసి అధ్యక్షులు పరామర్శించి పిల్లల తల్లిదండ్రులకు భరోసా కల్పించారు. అంగన్వాడి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ప్రభుత్వం అండగా ఉంటుందని ఎటువంటి సహాయమైనా చేనునట్లు పేర్కొన్నారు. ప్రభుత్వపరంగా హెల్ప్ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.