ఈ వీడియోలో నేలపై పడి ఉన్న కాగితాలను చూసారా..? అవి చిత్తు కాగితాలు అనుకుంటే పోరపాటే.. రైతులు భూములకు సంబంధించి వన్ బీ, ఆధార్ జిరాక్స్ లు.. ఎరువుల కోసం రైతులు పడుతున్న అవస్థలకు నిదర్శనం ఈ వీడియో... విజయనగరం జిల్లా మెరకముడిదాం మండల కేంద్రంలో ఉన్నటువంటి సొసైటీ ఆఫీస్ వద్ద బుధవారం రైతులు యూరియా కోసం ఈ విధంగా తమ జిరాక్స్ కాగితాలను లైన్ లో పెట్టారు. యూరియా సరఫరా చేస్తారని సమాచారం అందడంతో ఉదయం నుంచే సొసైటీ వద్దకు రైతన్నలు పెద్ద ఎత్తున చేరుకొని తమ వన్ బీ, ఆధార్, పాసుబుక్లు క్యూ లైన్లో పెట్టారు. యూరియ కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.