భీమవరం సిఐటియు కార్యాలయంలో వివోఎల జిల్లా విస్తృత సమావేశం శుక్రవారం మధ్యాహ్నం 3:30 కు జరిగింది. సమావేశానికి నాగిడి గోవిందమ్మ అధ్యక్షత వహించగా, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి. వాసుదేవరావు అనంతరం జరిగిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా సేవలందిస్తున్న వివోఎలకు కనీస వేతనం ₹26,000, ప్రతి ఒక్కరికి ₹15 లక్షల జీవిత బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. డ్వాక్రా మహిళా సంఘాలు ప్రభుత్వానికి ఆదాయం తెస్తున్నప్పటికీ వివోఎలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. యాప్‌లతో పనిభారం పెంచుతున్నారని, పెరుగుతున్న ధరలు, అద్దెలు, కరెంట్ ఛార్జీలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.