శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం తూముకుంట ఎస్బిఐ బ్రాంచ్ దోపిడీ కేసు చేదించిన హిందూపురం పోలీసులకు జిల్లా ఎస్పీ రత్న ఐపీఎస్ ప్రశంసా పత్రాలు అందజేశారు. హిందూపురం రూరల్ పరిధిలోని తూముకుంట చెక్పోస్ట్ సమీపంలో ఉన్న ఎస్బిఐ ( బ్రాంచ్) బ్యాంకులో జులై 26న, జరిగిన చోరీ కేసులో అంతర్రాష్ట్ర ముఠా సభ్యుడిని అరెస్టు చేయడంతో పాటు, రూ,2, కోట్ల విలువచేసే రెండు కేజీల బంగారు ఆభరణాలు, కారు మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకోవడంలో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ప్రత్యేక శ్రద్ధ కనబరచి నిందితులను అరెస్టు చేశారని వారికి అభినందనలు తెలిపారు. అనంతరం ప్రశంసా పత్రాలు అందజేశారు