విద్యార్థులు, యువతీ యువకులు కరాటే, తైక్వాండ్ శిక్షణ తీసుకోవడం వల్ల ఆత్మ విశ్వాసం పెరగడంతో పాటు, మనోధైర్యం కలుగుతుందని అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వనుము చిట్టబ్బాయి అన్నారు. కళాశాలలో బుధవారం విద్యార్థినులకు సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రాంను ఆయన ప్రారంభించారు. ఈ సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రాం పీఎం ఉష, జీఐఈఐ పథకం ద్వారా నిర్వహింపబడుతుందని తెలిపారు. నెల రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు.