మడకశిర కు చెందిన నారాయణస్వామి బుధవారం విజయవాడ బీసీ భవన్ లో రాష్ట్ర ఒకలిగా కార్పొరేషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు బీసీ భవన్ లోని ఆయన కార్యాలయం వద్ద సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి బాధ్యతలు చేపట్టడం జరిగింది.