మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని VHPS ధర్నా నిర్వహించింది. ఆ సంఘం నాయకుడు వీరేందర్ మాట్లాడుతూ.. దివ్యాంగులకు పెన్షన్ రూ.6000 పెంచాలని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత, బీడీ కార్మికులతో పాటు ఇతర పెన్షన్దారులకు రూ.4వేలకు పెంచాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్య మిస్తామన్నారు. ఎమ్మార్పీఎస్ నాయకులు బిక్షపతి, శివ, శ్రీరాముల పాల్గొన్నారు.