భవిష్యత్తులో తనకు పోటీ వస్తాడనే ఉద్దేశంతో జూనియర్ ఎన్టీఆర్ కుటుంబంపై మంత్రి నారా లోకేశ్ విమర్శలు చేయిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. గుంటూరులో అంబటి రాంబాబు బుధవారం మీడియాతో మాట్లాడారు. వైయస్సార్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో జరిగిన కార్యక్రమంపై కూడా అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీకి అధినేతగా లోకేశ్ పని చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.