వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో గురువారం సాయంత్రం ఐదు గంటలకు వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై గ్రానైట్ లారీకి ప్రమాదం తృటిలో తప్పింది. కరీంనగర్ నుంచి ఒడిశాకు గ్రానైట్ లోడ్ తో వెళ్తున్న లారీ డ్రైవర్ అజారుద్దీన్ కు ఫిట్స్ వచ్చింది. దీంతో హెవీ లోడ్ తో వెళ్తున్న లారీని సదర్ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి రోడ్డు పక్కన నిలపడంతో ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదు. దీంతో ఇటు అధికారులు అటు పోలీసులు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. లారీ డ్రైవర్ను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.