శానిటేషన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎల్.సుందరరావు డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం మధ్యాహ్నం పాడేరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఎదుట శానిటేషన్ కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి ఇన్చార్జి సూపరిండెంట్ డాక్టర్ నరసింగరావుకు వినతిపత్రం అందజేశారు. శానిటేషన్ కార్మికులకు ప్రతినెలా మొదటి వారంలో వేతనాలు చెల్లించాలని కోరారు. సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు.