ఇటీవల చింతపల్లి ఏపీఆర్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి పద్య పఠనం, వకృత్వం పోటీల్లో బాలారం ఏకలవ్య మోడల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనపరచారు. పద్య పఠనంలో ఈ.మణికంఠ ప్రథమ బహుమతి, వకృత్వంలో పీ.ప్రదీప్ తృతీయ బహుమతులు సాధించారని ప్రిన్సిపల్ డాక్టర్ సతీశ్ కుమార్ తెలిపారు. ఈమేరకు ఆదివారం సాయంత్రం పాఠశాల ఆవరణలో విద్యార్థులను, తెలుగు ఉపాధ్యాయులు వీర వెంకట్, కృష్ణవేణిలను అభినందించారు.