Kavali, Sri Potti Sriramulu Nellore | Aug 29, 2025
కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి స్థాయికి తగ్గట్లు మాట్లాడాలని వైసీపీ నాయకులు సూచించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఓ కళ్యాణ మండపంలో నాయకులు మాట్లాడుతూ.. 'కావలి రావాలని సవాల్ చేశారు. వచ్చాక పోలీసుల సాయంతో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అనుచితం. ఇది చాలా బాధాకరం' అని వైసీపీ నాయకులు అన్నారు.