వీరులపాడు మండల పరిధిలోని వెల్లంకి గ్రామ శివారులోని సుబాబుల్ తోటలో బుధవారం రాత్రిఫిక్కీ 11 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది... తోటలో భారీగా అగ్ని కీలలు వ్యాపించాయి. అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సుబాబులు తోట చుట్టూ 300 ఎకరాల్లో సుబాబులు ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు వెంటనే ప్రమాద సంఘటనపై అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. ప్రమాదం ఎలా జరిగింది అన్న దానిపై అగ్నీ మాపక శాఖ అధికారులు వాకబు చేస్తున్నారు ప్రమాద సంఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.