కరీంనగర్ నగరంలో వినాయక విగ్రహాల తయారీ కేంద్రాల నుంచి మండ పాలకు గణ నాధులు తరలి వెళ్తుండడంతో నగరంలో మంగళవారం ట్రాఫిక్ జామ్ అవుతుంది. నగరంలోని విద్యానగర్, రేకుర్తి, శివ థియేటర్ బ్యాక్ సైడ్, మార్కెట్ రోడ్ తదితర విగ్రహాల తయారీ కేంద్రాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. భారీ విగ్రహాలను తరలించేందుకు భారీ వాహనాలు రోడ్డు పైకి తీసుకురావడం వల్లే ట్రాఫిక్ జామ్ అవుతున్నట్లు వాహనదారులు తెలిపారు.