కామారెడ్డి : మిల్లర్లు సిఎమ్ఆర్ డెలివరీ త్వరితగతిన పూర్తి చేసి ఇవ్వాలి, లేనిచో చర్యలు తీసుకోబడును అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. అలాగే బ్యాంక్ గ్యారెంటిలు సమర్పించాలని ఆదేశించారు. ఐడిఒసి కార్యాలయపు కాన్ఫరెన్స్ హాలులో రైస్ మిల్లర్ల, పౌరసరఫరాల అదికారులతో సి ఎమ్ ఆర్ డెలివరి గురించి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మిల్లర్లు సిఎమ్ఆర్ డెలివరీ త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రభుత్వం ఖరీఫ్ 2024-25 నకు సంబధించి 12 సెప్టెంబర్ 2025 వ తేదీ వరకు గడువు ఇచ్చిందని పెండింగ్ సి ఎమ్ ఆర్ డెలివరి పూర్తి చేయాలని అన్నారు. ప్రతి రోజు క్రమం తప్పకుండా మిల్లింగ్ జరపాలన్నారు.