భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధిక వర్షాలు పడే అవకాశం ఉన్నందున కొత్తగూడెం డివిజన్ భూ సమస్యలకు సంబంధించి కొత్తగూడెం ఆర్డిఓ ఆఫీస్ లో, మరియు భద్రాచలం డివిజన్ భూ సమస్యలు భద్రాచలం సబ్ కలెక్టర్ ఆఫీసులో ప్రజలు తమ దరఖాస్తులు అందజేయాలని, వేరే ఇతర సమస్యలపై దరఖాస్తులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఇన్ వర్డ్ సెక్షన్లో అందజేసి రసీదు పొందువచ్చని, వారు సంబంధిత అధికారులకు పంపిస్తారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం తెలిపారు. రేపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యాలయంలో ప్రజావాణి ఉండదని అని తెలిపారు.