భారతదేశ చరిత్రలో మనకు తెలియని చాలామంది వీరుల గాథ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ పట్టణంలో ఏర్పాటుచేసిన వీర్ బాల్ దివాస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 17వ దశకంలో గురు గోవింద్ సింగ్ కుమారులు మతమార్పిడికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి చిన్న వయసులోనే తమ ప్రాణాలను త్యాగం చేశారని గుర్తు చేశారు. వారి ధైర్య సాహసాలను, త్యాగాలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలన్నారు.