జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా నూతన కార్యక్రమానికి బుధవారం మధ్యాహ్నం శ్రీకారం చుట్టారు. విద్యార్థుల్లోని నైపుణ్యాలను పెంపొందించడానికి జిల్లాలోని విద్యావ్యవస్థను మరింత పటిష్టపరిచేందుకు దిక్సూచి పేరుతో కొత్త కార్యక్రమాన్ని చేపట్టారు. దీని అమలుపై అన్ని ఉన్నత ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్షించి దిశానిర్దేశం చేశారు కలెక్టర్. ఈ కార్యక్రమంతో విద్యార్థుల్లో చదువుతోపాటు మరింత నైపుణ్యాన్ని పెంపొందించే దిశగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆయన అన్నారు