రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండలం, బద్దేనపల్లి గ్రామ శివారులో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై ఉపేంద్ర చారి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బద్దేనపల్లి కి చెందిన నరేందర్ బాబు అనే వ్యక్తి తంగళ్ళపల్లి కి ఇసుకను తరలిస్తున్నాడు. ఆ ట్రాక్టర్ ను పట్టుకొని తనిఖీ చేయగా ట్రాక్టర్ డ్రైవర్, యజమాని నరేందర్ బాబు వద్ద ఇసుక రవాణాకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేనందున ట్రాక్టర్ ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. నేరస్తునికి జడ్జి జ్యూడిషియల్ రిమాండ్ విధించి కరీంన