Kandukur, Sri Potti Sriramulu Nellore | Sep 2, 2025
కరేడు రైతు ఉద్యమాన్ని 2,3 రోజుల్లో ఉద్ధృతం చేస్తామని bcy నేత బోడె రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు. విజయవాడ నుంచి పుంగనూరు వెళుతూ హైవేపై తనను కలిసిన కరేడు రైతు బృందంతో మాట్లాడారు. పోలీసులను అడ్డం పెట్టుకుని భయపెట్టే కార్యక్రమం ఎంతో కాలం సాగదన్నారు. పోలీసులు నీచానికి దిగజారిపోయారని మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఘాటుగా విమర్శించారు. ఈ సారి ఉద్యమాన్ని ఆపడం ఎవరి తరం కాదు.. ధైర్యంగా ఉండమని సూచించారు.