హనుమకొండ ఏసీపీ మరియు కేయూ పోలీసులు బెల్ట్ షాపులు మరియు పాన్ షాప్ లపై మెరుపు దాడి చేశారు ఈ మెరుపు దాడిలో 25వేల రూపాయల మద్యంతో పాటు 5000 రూపాయల పొగాకు ఉత్పత్తులు స్వాధీన పరుచుకున్నారు కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్ల సింగారం మరియు డబ్బాల ప్రాంతంలో పోలీసులు బుధవారం రోజు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు హనుమకొండ ఏసిపి నరసింహారావు మరియు కేయూ సీఐ రవికుమార్ పోలీస్ సిబ్బందితో కలిసి గుండ్ల సింగారంలోని బెల్ట్ షాప్ లపై దాడి చేయడంతో 25వేల రూపాయలు విలువచేసే వివిధ రకాల మద్యం బాటిల్స్ స్వాధీన పరుచుకున్నట్లు పోలీసులు తెలిపారు