సిఫార్సు మేరకు మాత్రమే యూరియా వాడాలని అధికంగా వాడడం వలన పంటలకు చీడపీడలు ఉద్ధృతి పెరుగుతుందని వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఏడిఏ పద్మలత రైతులకు సూచించారు. గురువారం గుమ్మగట్ట, రాయదుర్గం మండలాల్లోని బూపసముద్రం, బేలోడు, ఆవులదట్ల, ఉడేగోళం గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించారు. యూరియా అధికంగా వాడితే నేల భౌతిక, రసాయనిక లక్షణాలు పాడవుతామన్నారు. కాండం పెలుసు గా మారి గాలికి, వర్షానికి పైరు పడిపోతుందన్నారు.