పుంగనూరు పట్టణంలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గత 09రోజులుగా పూజలందుకున్న గౌరీ పుత్రుడు తల్లి గంగమ్మ చెంతకు చేరుతున్నాడు. పిల్లలు, పెద్దలు, యువత ఎంతో ఉత్సాహంగా కేరింతలు కొడుతూ సాంస్కృతిక కార్యక్రమాల నడుమ బొజ్జ గణపయ్యను సాగనంపుతున్నారు. పట్టణంలోని తెరు వీధి, బెస్తవీధి, కోనేటి వద్ద ఏర్పాటు చేసిన బొజ్జ గణపయ్యను, బాణా సంచా పేల్చుతూ బళ్లారి బళ్లారి డ్రమ్స్ తో యువకులు నృత్యాలు చేస్తూ పట్టణ పురవీధుల్లో ఊరేగింపుగా గురువారం సాయంత్రం ఐదు గంటలకు తరలించారు.