చంద్రశేఖరపురం మండలంలోని అయ్యలూరి వారి పల్లి గ్రామంలో గణేష్ ఉత్సవాల సందర్భంగా శుక్రవారం గణేష్ మండపం వద్ద ఏర్పాటుచేసిన స్వామి వారి లడ్డూకు ఉత్సవ కమిటీ నిర్వాహకులు వేలంపాట నిర్వహించారు. గ్రామానికి చెందిన పాలగుల్ల మోహన్ రెడ్డి వేలంపాటలో గణేష్ లడ్డూను రూ.30 లక్షల అత్యధిక ధరకు పాడి లడ్డును దక్కించుకున్నారు. అదేవిధంగా స్వామివారి కలశాన్ని గ్రామానికి చెందిన ముత్యాల నారాయణరెడ్డి రూ 19.10 లక్షలు కు వేలంపాటలో దక్కించుకున్నారు. గణేష్ లడ్డు మరియు కలశం కు అత్యధిక ధర వేలంపాటలో లభించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.