ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జనానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. తొమ్మిది రోజులపాటు భక్తులచే విశేష పూజలు అందుకున్న బొజ్జ గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చేందుకు ఉత్సవ సమితి సభ్యులు నిమగ్నం కాగా.. నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగే విధంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే చెరువుల వద్ద భారీ క్రేన్లను ఏర్పాటు చేసిన అధికారులు.. నగరంలో పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు