Kandukur, Sri Potti Sriramulu Nellore | Sep 8, 2025
యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలించి రైతులను ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పెడుతుందని వైసీపీ కందుకూరు నియోజకవర్గ పరిశీలకులు సత్యనారాయణ రెడ్డి మండిపడ్డారు. 9న "రైతన్నకు బాసటగా వైసీపీ అన్నదాత పోరు" పోస్టర్ను కందుకూరు పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన ఆవిష్కరించారు. రాష్ట్రంలో బస్తా యూరియా కోసం మండుటెండలో రైతులు నరకయాతన అనుభవిస్తుంటే కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. ఈ కార్యక్రమం సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జరిగింది