బోధన్ లోని పెగడపల్లి గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్థిని గురువారం సాయంత్రం అదృశ్యమైంది. తండ్రితో ఇంటికి వస్తుండగా బోధన్ పట్టణంలోని పెగడపల్లి చౌరస్తా వద్ద తండ్రి బాలికను దింపి ఇంటికి వెళ్ళమని చెప్పి వెళ్ళాడు. బాలిక ఇంటికి వెళ్లకపోవడంతో తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అక్కడే షోరూమ్ లో పనిచేసే ఓ మహిళ విద్యార్థిని పాఠశాలకు వెళ్లడానికి ఇష్టం లేదని, తండ్రి తిట్టాడని ఏడ్చిందని, తన వెంట ఇంటికి వచ్చిందని, నచ్చచెప్పి శుక్రవారం పాఠశాల వద్ద వదిలి వెళ్ళిపోయిందని తెలిపింది. అనంతరం బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించారు