గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహా గణపతి..* హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణపతి ట్యాంక్ బండ్ వద్ద గంగమ్మ ఒడికి చేరుకున్నాడు.. సెక్రటేరియట్ ముందు నుంచి ఎన్టీఆర్ మార్గ్‌లో శోభా యాత్ర కొనసాగింది. నాలుగో నంబర్ స్టాండు వద్ద గణనాథుడు గంగమ్మ ఒడికి చేరనున్నాడు. వెల్డింగ్ పనుల అనంతరం పూజలు నిర్వహించి గణేశుడిని నిమజ్జనం చేశారు. మహా గణపతి నిమజ్జనాన్ని కన్నులారా తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. దీంతో, ట్యాంక్ బండ్ పరిసరాలు భక్త జన సందోహంతో నిండి పోయాయి..