ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో అనంతపురం అర్బన్ నియోజకవర్గ పరిధిలో రికార్డు స్థాయిలో సీఎంఆర్ఎఫ్ కింద సాయం అందిస్తున్నామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. అర్బన్ టీడీపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. మొత్తం 79 మందికి 79 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. లబ్ధిదారులందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ వారి ఆరోగ్య విషయాలను తెలుసుకున్నారు. చెక్కులు తీసుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు.