అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో చారిత్రాత్మకమైన బ్రిటిష్ సైనిక అధికారుల సమాధుల స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలకు అండగా నిలుస్తున్న నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ తాహసిల్దారులపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేస్తున్నామని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ ఏ అజయ్ శర్మ అన్నారు.