జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శనివారం లక్ష్మీదేవి పల్లి మండల పరిధిలోని జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న పోలీస్ అధికారులతో ఎస్పీ గారు మాట్లాడుతూ ప్రతీ కేసులో 'క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్' ద్వారా నేరస్తులకు శిక్షపడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు.కేసుల విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.పోలీస్ అధికారులంతా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.