బ్యాంకుల వద్ద రుణాల పేరుతో రైతులను నట్టేట ముంచుతున్న దళారీ వ్యవస్థను జిల్లా అధికారులు అరికట్టాలని CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దినకర్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ ఋణాలు ప్రారంభం కావడంతో రైతులు బ్యాంకులకు క్యూ కట్టారు. దాన్ని దళారులు ఆసరా చేసుకొని రైతుల వద్ద ముక్కుపిండి కమిషన్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. బ్యాంకర్లు సైతం నేరుగా రైతు బ్యాంకు కు వెళ్తే ఏ పని చేయట్లేదు. దళారులను ఆశ్రయిస్తే మాత్రం నిముషాల్లో పని చేస్తున్నారన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని బ్యాంకుల్లో ఇదే తతంగం జరుగుతుందన్నారు.