అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని కసాపురం రోడ్డులో ఉన్న ఆర్డీఓ కార్యాలయం ఎదుట అర్హులైన దివ్యాంగుల పింఛన్లు తొలగించడం పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నా చేశారు. గురువారం పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.. ఈ సందర్భంగా గుంతకల్లు మునిసిపల్ వైస్ చైర్ పర్సన్ నైరుతి రెడ్డి, మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా పించన్లు తీసుకుంటున్న వారి పింఛన్లు అన్యాయంగా కూటమి ప్రభుత్వం తొలగించిందన్నారు.