లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలో అనిశెట్టిపల్లి గ్రామపంచాయతీలోని కోనారం గ్రామంలో ఫారెస్ట్ అధికారులు అక్రమంగా పంటచేలను ధ్వంసం చేయడం సరైనది కాదని,వారి పైన చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కొత్తగూడెం డివిజన్ కార్యదర్శి కృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం కూనారం గ్రామంలో ధ్వంసం చేసిన మొక్కజొన్న చేలను రైతులతో కలిసి మాస్ లైన్ ప్రతినిధి బృందం పరిశీలించింది.కృష్ణ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారని,రెవిన్యూ ఫారెస్ట్ అధికారులు గతంలో సంయుక్తంగా సర్వే నిర్వహించారని అన్నారు